Bhimalapuram.co.in
అన్నమాచార్య కీర్తనలు -13192
రవ్వ మాని ఆయనాయ రారే మీరు
రాగము: శ్రీరాగం
రవ్వ మాని ఆయనాయ రారే మీరు | |
అవ్వలఁ దన్నుఁ బిలిచేయంతవారమా | ॥పల్లవి॥ |
తడవీనా మమ్మతఁడు తరుణులఁ గడమా | |
పడఁతు లాతనికైతే పాదరేణువు | |
బడిబడి నే వలచి పైఁబడేఁగాని తనకు | |
చిడుముడిఁ జెట్టడువఁ జేటఁడేసిన సతులు | ॥రవ్వ॥ |
వలచీనా నా కతఁడు వనితలు లేరా | |
వలచివచ్చేవారే వనమెల్లాను | |
వెలయ నేఁ దనపొందు విడువఁగలేఁ గాక | |
చిలికితే నేమిబాఁతి చెలువలేతనికి | ॥రవ్వ॥ |
మానీనా నన్నతఁడు మగువ లెందరుండినా | |
పూని యాతనిసతులే భూమెల్లాను | |
యీనెపాన శ్రీవేంకటేశుఁ డిట్టె నన్నుఁగూడె | |
కానికగాఁ బూజగొంటే గంపెడేసిసతులు | ॥రవ్వ॥ |
కీర్తన విభాగము ఆంగ్లము తెలుగు తెలుగులిపిలేదు