Bhimalapuram.co.in
అన్నమాచార్య కీర్తనలు -13197
రాకురాకు మయ్యా మాతో రంతు లింతేలా
రాగము: శ్రీరాగం
రాకురాకు మయ్యా మాతో రంతు లింతేలా | |
వాకు నిష్టూరాన నిన్ను వద్దన నేఁ జాలను | ॥పల్లవి॥ |
తొలవయ్య కాలుదాఁకీ దోసాలు గట్టకా | |
తొలుతేమి చేసితినో తొయ్యలినైతి | |
చెలఁగి యిందఱూ నీకుఁ జేయెత్తి మ్రొక్కగా | |
చిలుకు గోళ్ల నిన్నుఁ జెనక నేఁ జాలను | ॥రాకు॥ |
ఏమిటికి నంటించేవు ఎంగిలి మామోవి | |
బూమిలేని చదువుల పుట్ట నీనోరు | |
వేమాఱు నిందఱు నీకు వినుతించి మ్రొక్కంగ | |
ప్రేమపునో ర నిన్ను పేరఁ దిట్టఁజాలను | ॥రాకు॥ |
యేల కిందుపడి మొక్కే వేమి బాఁతినే నీకు | |
కూళ నింతేని కాలిగోరఁ బోలను | |
మేలిమి శ్రీ వేంకటేశ మెఱసి మాచనవు | |
మేలములాడుచు నిన్ను మెప్పించ నేఁ జాలను | ॥రాకు॥ |
కీర్తన విభాగము ఆంగ్లము తెలుగు తెలుగులిపిలేదు