Bhimalapuram.co.in
అన్నమాచార్య కీర్తనలు -13228

రామా రామా రాజీవనయనా

రాగము: ఆహిరినాట

రామా రామా రాజీవనయనా
కామించి నినుఁ జూచె గక్కన మా చెలియ॥పల్లవి॥
  
  
యింతి పిలువనంపె నెడమాటలేలా
యింతలో విచ్చేయు ఎన్నికగాక
చెంత నిందులకుఁగా సెలవి నవ్వేలా
పంతముతో నాకెఁ బాలింతు గాక॥రామా॥
  
  
తరుణి పూవుల వేసె తలవంచనేలా
సరినీవు మోహమే చల్లుదుగాక
నిరతి నిందుకుఁగా నివ్వెరగేలా
మరిగి యాకెను నీవే మన్నింతుగాక॥రామా॥
  
  
మగువ కాఁగిటఁ గూడె మరి సిగ్గులేలా
వెగటురతుల విఱ్ఱమీఁగుదుగాక
వగల శ్రీ వేంకటేశ వావిలిపాటిరామ
మిగుల సీతతో మెఱుతువుగాక॥రామా॥
  
  

కీర్తన విభాగము ఆంగ్లము తెలుగు తెలుగులిపిలేదు

Valid XHTML 1.0 Transitional

Valid CSS!