Bhimalapuram.co.in
అన్నమాచార్య కీర్తనలు -13242

రారాఁపు లిఁకనేల రావే నీవు

రాగము: ముఖారి

రారాఁపు లిఁకనేల రావే నీవు
సారెకుఁ బతి విలువఁ జలమా నీకు॥పల్లవి॥
  
  
వేడుకలు దైవారె వెన్నెల నవ్వులు గారె
యేడకేడ పతిమాఁట లియ్యకొనవే
కూడుటే కావలె నొండె కోపమే కావలె నొండె
నీడనుండే యెండ దాఁకి నీకుఁ జుల్లునా॥రారాఁ॥
  
  
మొక్కిన చేతులు రాసె మెకమోటములు వాసె
యిక్కువ విభునితేఁత కియ్యకొనవే
మక్కువైయుండుట వొండె మత్సరమైయుండుటొండె
వెక్కసాలు వినయాలు వెలయించఁ జెల్లునా॥రారాఁ॥
  
  
చిత్తములు సరివచ్చె సిగ్గులెల్లా గురివిచ్చె
యెత్తి శ్రీవేంకటేశే లియ్యకొనవే
యిత్తల గూడితిరి మీరిద్దరును నొండొండె
మత్తిలి తొల్లిటిపొందు మరవఁగఁ జెల్లునా॥రారాఁ॥
  
  

కీర్తన విభాగము ఆంగ్లము తెలుగు తెలుగులిపిలేదు

Valid XHTML 1.0 Transitional

Valid CSS!