Bhimalapuram.co.in
అన్నమాచార్య కీర్తనలు -13256

రావయ్యా ఇఁకనైనా రమణి వేఁడుకొనీని

రాగము: కాంబోది

రావయ్యా ఇఁకనైనా రమణి వేఁడుకొనీని
వావిరి నీకెతో నింత వాసు లెంచఁదగునా॥పల్లవి॥
  
  
పంతమాడరాదుగాని పచారించి నవ్వవచ్చు
మంతనాన సతికిని మగనితోను
వింతసేయరాదుగాని వెంగెమైనా నాడవచ్చు
చెంతఁదనమాట చెల్లించేవానితోను॥రావ॥
  
  
సిగ్గుపడరాదుగాని చేరి జంకించఁగవచ్చు
కగ్గక తనపై బత్తిగల వానితోను
వెగ్గళించరాదుగాని వేమారుఁ గొసరవచ్చు
నిగ్గులఁ దన్ను మన్నించే నెరజాణతోను॥రావ॥
  
  
రచ్చఁ బెట్టరాదుగాని రతిఁ బెనఁగఁగవచ్చు
యెచ్చటా నెగ్గుపట్టనియిష్టునితోను
మచ్చరించరాదు గాని మనసు గరఁచవచ్చు
కచ్చు పెట్టికూడే శ్రీవేంకటేశుఁడ నీతోను॥రావ॥
  
  

కీర్తన విభాగము ఆంగ్లము తెలుగు తెలుగులిపిలేదు

Valid XHTML 1.0 Transitional

Valid CSS!