Bhimalapuram.co.in
అన్నమాచార్య కీర్తనలు -13261

రావే ఆతఁడు నిన్ను రంతుసేసి పిలిచీని

రాగము: కాంబోది

రావే ఆతఁడు నిన్ను రంతుసేసి పిలిచీని
తావులనే లోఁగుటే తగు నేరుపు॥పల్లవి॥
  
  
బలిమిఁ బెనఁగరాదు పాయపువారికెల్ల
వలనైనచనవు చూపవలెఁగాని
కలిగినవేడుకలు కై వ్రాలకుండాను
నెలవునఁ గూడుటే నెరవైననేరుపు॥రావే॥
  
  
వాదు లడువఁగరాదు వలచినవారికెల్ల
సేదదేరి చెప్పినట్లు చేసుటేకాని
పోదిగొన్న కోరికలు పొది విచ్చకుండాను
సాదువలె లోనౌటె చక్కనినేరుపు॥రావే॥
  
  
సిగ్గులువడఁగరాదు సేసపాలవారి కెల్ల
నిగ్గులఁ గాఁగిటఁ గూడి నిక్కు టేకాని
అగ్గమై శ్రీవేంకటేశుఁ డరిసి నిన్నుఁ గలసె
కగ్గులేక సుఖించుటే కడునేరుపు॥రావే॥
  
  

కీర్తన విభాగము ఆంగ్లము తెలుగు తెలుగులిపిలేదు

Valid XHTML 1.0 Transitional

Valid CSS!