Bhimalapuram.co.in
అన్నమాచార్య కీర్తనలు -13268

రాఁగదవే అన్నిటాను రవ్వయితిమి

రాగము: ఆందోళి

రాఁగదవే అన్నిటాను రవ్వయితిమి
కాఁగిన కాఁకలచేతఁ గరివడె నిపుడు॥పల్లవి॥
  
  
సాదించేవు నీ కాతఁడు చాయలకు వచ్చీనా
వాదించేవు నీ కాతఁడు వలచీనా
ఆదిగొని చెలులెల్ల నట్టె పైపైఁ బడఁగాను
గాదిలియాతనిమది కాయగాచె నిపుడు॥రాగ॥
  
  
చెనకే వాతఁడు నీచెప్పినట్టు సేసీనా
పెనఁగే వాతఁ డందుకు ప్రియపడీనా
వనితలందరు వచ్చి వద్దనే వుండఁగాను
చనుమానముల మొగచాటాయ నిపుడు॥రాగ॥
  
  
యేకతానకు దీసేవు యింతలోనే లోనయ్యీనా
పైకొని కూడితి వట్టె బాఁతిపడి
శ్రీకాంత వురమెక్కిన శ్రీవేంకటేశుఁ డితఁడు
మైకొని వురమెల్లాను మట్టుపడె నిపుడు॥రాగ॥
  
  

కీర్తన విభాగము ఆంగ్లము తెలుగు తెలుగులిపిలేదు

Valid XHTML 1.0 Transitional

Valid CSS!