Bhimalapuram.co.in
అన్నమాచార్య కీర్తనలు -13356

వచ్చె నదివో రమణుఁడు వాకిటి కోచెలులాల

రాగము: దేసాళం

వచ్చె నదివో రమణుఁడు వాకిటి కోచెలులాల
పచ్చిదేర నొక్కమాటే పలుకరే యిపుడు॥పల్లవి॥
  
  
వెలఁదికి వెలినున్న విభునిఁ దోడుకరాక
చెలు లేమిచెప్పినాను చెవిఁ బట్టవు
మలసి యాతనితోడ మాఁటలెల్లా నాడక
పలుపుపచారాలు పనిరావు॥వచ్చె॥
  
  
చన్నులపై నాతనిమై సారె నప్పళించుకోక
సన్న లెంత సేనినాను సమ్మతిగాదు
కన్నుల నాతనిరూపు గక్కనఁ గనుఁగొనక
వున్నతి మీరాకలకు వుల్లము గరఁగదు॥వచ్చె॥
  
  
తిరమై యాతనిమోవితేనె చవిచడక
సరుగ మీకానుకలు సంగతిగావు
యిరవై శ్రీవేంకటేశుఁ డితలోనె యీకెఁ గూడె
వెరగయ్యీ మీనేర్పులు వెలితిలేవు॥వచ్చె॥
  
  

కీర్తన విభాగము ఆంగ్లము తెలుగు తెలుగులిపిలేదు

Valid XHTML 1.0 Transitional

Valid CSS!