Bhimalapuram.co.in
అన్నమాచార్య కీర్తనలు -13358

వచ్చేనని రాకుందురా యేమే నీవు

రాగము: శ్రీరాగం

వచ్చేనని రాకుందురా యేమే నీవు
అచ్చల మేమి గల్లాను అప్పుడే యాడరాదా॥పల్లవి॥
  
  
యీడనుండే యింత సేతురా పూవుటింతి
వాడఁబెట్టి ముడిచితే వాసన గద్దా
వేడుకలు వెతసేతురా పతి
నాడ నెదురు చూపించినది పెద్దరికమా॥వచ్చే॥
  
  
ఆసలనే యలయింతురా గాలి దెచ్చి
మూసిపట్టి తెరచితే మూల నుండునా
పాసి కూడి పగ లౌదురా యేమే యిఁక
వేసాలు మాని యాడకే విచ్చేయఁగదవే॥వచ్చే॥
  
  
డగ్గరియుఁ దల వంతురా యీ నీరు
బుగ్గవంటిపాయ మిది పొల్లు సేతురా
కగ్గి శ్రీవేంకటవిభుఁడు నిన్నుఁగూడె
యెగ్గులెల్లా మఱచితి వెడమాట లేఁటికే॥వచ్చే॥
  
  

కీర్తన విభాగము ఆంగ్లము తెలుగు తెలుగులిపిలేదు

Valid XHTML 1.0 Transitional

Valid CSS!