Bhimalapuram.co.in
అన్నమాచార్య కీర్తనలు -13374

వట్టి జోలిఁ బొరలేవు వద్దన్నా మానవు

రాగము: ఆహిరి

వట్టి జోలిఁ బొరలేవు వద్దన్నా మానవు
వొట్టు కొకరి సొమ్ము వేరొకరికి దక్కునా॥పల్లవి॥
  
  
చక్కనిదాన వౌదువు జాణతనాలు నేర్తువు
ముక్కరఁ వెట్టుకుంటివి మోము చూచేవు
నెక్కొన్న నారమణుఁడు నీయెలయింపులకు
చిక్కఁడు గాని నీచేఁతలకు మెచ్చును॥వట్టి॥
  
  
చుట్టమవు నౌదువు చొక్కులఁబెట్టాఁగలవు
యిట్టె సింగారించుకొంటి వీతనెదుట
గుట్టుతోడ నావిభుఁడు కోరి యిందుకు నిన్నుఁ జే-
పట్టఁడుగాని నీపగటులు మెచ్చును॥వట్టి॥
  
  
మేలుదానవు నౌదువు మెప్పించా నీచేతనౌను
వేళ గాచుకుందానవు వెస మొక్కేవు
యేలె నన్ను శ్రీవేంకటేశుఁ డలమేల్‌మంగను
నీలోనుగాఁడుగాని నీబత్తికి మెచ్చును॥వట్టి॥
  
  

కీర్తన విభాగము ఆంగ్లము తెలుగు తెలుగులిపిలేదు

Valid XHTML 1.0 Transitional

Valid CSS!