Bhimalapuram.co.in
అన్నమాచార్య కీర్తనలు -13388

వట్టిపరాకులు సేయవద్దు నీకు నిఁకనేల

రాగము: బౌళి

వట్టిపరాకులు సేయవద్దు నీకు నిఁకనేల
గుట్టు నే మెఱుఁగుదుము కొంక నీకేఁటికిని॥పల్లవి॥
  
  
వేసరక వూడిగాలు వేమరుఁ జేసీ నీకె
పూసగుచ్చినట్టు నీకు బుద్ది చెప్పీని
వాసులువంతు లెంచక వద్దనే కాచుకున్నది
నీసము కాన నదిగో నెలఁతఁ జూడరాదా॥వట్టి॥
  
  
కైవసము సేసుకొని కన్నుల నిన్ను నవ్వీని
వావులు నీతోఁ జెప్పి వలపించీని
పూవులు ముడిచి నీతో పొందులు నటించీని
దేవులాయ విన్నిటాను తెరవేసుకోరాదా॥వట్టి॥
  
  
పానుపుపైఁ గూచుండి పాదాలు విసికీని
మేనిపై గందము వూసీ మెల్లనే తాను
ఆనుక శ్రీవేంకటేశ అలమేలు మంగ యీకె
పూని నిన్నుఁ గాఁగిలించె పొగడఁగరాదా॥వట్టి॥
  
  

కీర్తన విభాగము ఆంగ్లము తెలుగు తెలుగులిపిలేదు

Valid XHTML 1.0 Transitional

Valid CSS!