Bhimalapuram.co.in
అన్నమాచార్య కీర్తనలు -13392

వట్టి పెనఁగులాటల వలపు చవులు గాదు

రాగము: బౌళి

వట్టి పెనఁగులాటల వలపు చవులు గాదు
గుట్టుతో మెలఁగితేను గుణములు హెచ్చును॥పల్లవి॥
  
  
మనసు లెనసితేను మాటలు ప్రియములౌను
ననుపు గలిగితేను నమ్మికలౌను
చనవులు సతమైతే సరసము లింపౌను
వినయాలు చూపితేను వేడుకౌను పొందులు॥వట్టి॥
  
  
సిగ్గువడ నేరిచితే చేఁతలు తరితీపౌను
యెగ్గులెల్లా మానితేను ఇతవౌఁ బొందు
వెగ్గళించి పొగడితే విభావాలు చెలరేఁగు
వొగ్గి వేఁడుకొంటేను వుల్లములు గరఁగు॥వట్టి॥
  
  
తలపోఁత లొనరితే తమకము గడురేఁగు
నెలకొన నవ్వులను నిఁడు ముదము
యెలమి శ్రీవేంకటేశ యే నలమేలుమంగను
కలసితి మిద్దరముఁ గలుగుఁ జనవులు॥వట్టి॥
  
  

కీర్తన విభాగము ఆంగ్లము తెలుగు తెలుగులిపిలేదు

Valid XHTML 1.0 Transitional

Valid CSS!