Bhimalapuram.co.in
అన్నమాచార్య కీర్తనలు -13399

వట్టిమాటలఁ బోదు వలపు పేరడియైతే

రాగము: రీతిగౌళ

వట్టిమాటలఁ బోదు వలపు పేరడియైతే
గుట్టుతో నేమీ ననక కొంగువట్టుమనరే॥పల్లవి॥
  
  
పాయపుఁ దానూ నేను పంతములాడుకొంటే
కాయము లందలి కండగర్వ మందురు
చాయల నేకతమున సమరతి వుపరతి
సోయగపు బలుములు చూపవలె ననరే॥వట్టి॥
  
  
జాణల మిద్దరమును చనవునఁ బెనఁగితే
గాణలు మెరసినకాతర మందురు
ప్రాణమైనకాఁగిటిలో బంధవిశేషములను
రాణించఁజేసితే మేలు రాశికెక్కుననరే॥పట్టి॥
  
  
వొక్కటైన తాను నేను వూరకేవుండితేను
మక్కువ మీరిన యట్టి మత్తు లందురు
ఇక్కువ శ్రీ వేంకటేశుఁడిదె నన్నుఁ గూడెఁగాన
యెక్కువ తక్కువ గల్తే నెంచవలె ననలే॥వట్టి॥
  
  

కీర్తన విభాగము ఆంగ్లము తెలుగు తెలుగులిపిలేదు

Valid XHTML 1.0 Transitional

Valid CSS!