Bhimalapuram.co.in
అన్నమాచార్య కీర్తనలు -13415

వట్టి వాదులకునేల వచ్చీనే తాను

రాగము: దేసాళం

వట్టి వాదులకునేల వచ్చీనే తాను
అట్టునిట్టు జంకించి ఆదరించరాదా॥పల్లవి॥
  
  
తగవు చెప్పరే మీరు తరుణులాల
మొగముచూచేపతికి మొక్కరాదా
మగఁడు దనకై తేను మాటమాట సరసాన
వెగటుగాఁ దిట్టి నేను వేఁడుకోరాదా॥వట్టి॥
  
  
వొలపక్షమడకురే వువిదలాల
పలుమారుఁ బిలువఁగాఁ బలుకరాదా
మలసి తనవాఁడైతే మాతోఁ బెనఁగేవేళ
చెలఁగి గోరుదాఁకితే చెక్కునొక్కరాదా॥వట్టి॥
  
  
మీకే తెలుసునే మెలుఁతలాల
కైకొని నన్నుఁ గూడితేఁ గలయరాదా
జోక శ్రీవేంకటేశుఁడు సొరిదినే యేలఁగాను
వాకునఁ బ్రియము చెప్పి వంచుకోరాదా॥వట్టి॥
  
  

కీర్తన విభాగము ఆంగ్లము తెలుగు తెలుగులిపిలేదు

Valid XHTML 1.0 Transitional

Valid CSS!