Bhimalapuram.co.in
అన్నమాచార్య కీర్తనలు -13463

వద్దన్న మానవైతి వాని నిట్టె చెనకితి

రాగము: రామక్రియ

వద్దన్న మానవైతి వాని నిట్టె చెనకితి
చద్దిజగడాలు నేఁడు సరివచ్చె గా॥పల్లవి॥
  
  
అప్పుడే నే నంటిఁగా ఆతని మన మేమన్న
చెప్పినవారినే తిట్టి చెనకీ నని
తప్పు తనవొళ్ళఁ గలా తగ దన్నవారి నెల్లా
దెప్పదాన నాయాలకుఁ దీసీనని॥వద్దన్న॥
  
  
తారుకాణ వద్దంటిఁగా తానే వాఁడు కల్లకైనా
కోరి నాపై నాన వెట్టుకొనీ నని
దారి దప్పక వుండినా తనమాటె గెల్చుదాఁకా
పొరి పొరి యాడనైనా బొంకీ నని॥వద్దన్న॥
  
  
కోపగించకు మంటిఁగా గుఱియై నిలిచితేనే
చేపట్టి వాడఁ బలిమి సేసీ నని
యేపున శ్రీవేంకటేశుఁడెందుబో నిక కూడె
యేపొద్దూఁ బాయ మింక నిద్దరము నొక్కటే॥వద్దన్న॥
  
  

కీర్తన విభాగము ఆంగ్లము తెలుగు తెలుగులిపిలేదు

Valid XHTML 1.0 Transitional

Valid CSS!