Bhimalapuram.co.in
అన్నమాచార్య కీర్తనలు -13473

వద్దు నీకు వగవఁగ వడి నలసితి వని

రాగము: గౌళ

వద్దు నీకు వగవఁగ వడి నలసితి వని
చద్దికి వేఁడికి నీకుఁ జలి వాసెఁగా॥పల్లవి॥
  
  
చిత్తడి చెమటలు నీచెక్కులనే వెడ జారె
యెత్తలఁ గొండలు నీవెంద్కెకి వచ్చితో
హత్తి నీకు నవులే తొల్లి ఆవులఁ గాచిననాఁడే
చిత్తగించి అలవాటు సేసుకొంటిగా॥వద్దు॥
  
  
ముక్కున నూరుపు లవే ముంచి బుసకొట్టేవు
పెక్కుమారు లెవ్వరితోఁ బెనఁగితివో
గుక్కక నీ కవులే తొల్లి గొల్లెతలతోఁ బెనఁగి
చిక్కించుక అలవాటు సేసుకొంటిగా॥వద్దు॥
  
  
కాయమున నీకు నీదే కడు బడలిక దేరీ
సేయరానిపను లేమి సేసి వచ్చితో
యీయెడ శ్రీవేంకటేశ యిటు నన్నుఁ గూడితి
చేయార నీయలవాటు సేసుకొంటిగా॥వద్దు॥
  
  

కీర్తన విభాగము ఆంగ్లము తెలుగు తెలుగులిపిలేదు

Valid XHTML 1.0 Transitional

Valid CSS!