Bhimalapuram.co.in
అన్నమాచార్య కీర్తనలు -13479

వద్దు వద్దు కోపము వదినె నింతే నీకు

రాగము: ముఖారి

వద్దు వద్దు కోపము వదినె నింతే నీకు
సుద్దులేల చెప్పేవు సొలసితి నిన్నును॥పల్లవి॥
  
  
మారుకొన్న దానఁగాను మాటాడినదానఁగాను
యేరా నాతోనేల యెగ్గు పట్టేవు
గీరితి నింతే గోర కెలని పరాకు రాఁగా
కూరిమి నిట్టే వేఁడుకొనేను నిన్నును॥పల్లవి॥
  
  
గుంపించినదానఁ గాను గొణఁగిన దానఁ గాను
తెంపున నేరా నన్ను దీకొనేవు
చెంపల చెమట జార చేఁతఁదుడిచితి నింతే
అంపలేను ఆయమంటి ఆదరించే నిన్నును॥వద్దు॥
  
  
పాసివున్నదానఁ గాను పదరినదానఁగాను
వేసరక నన్నునేల వెడ్డువెట్టేవు
ఆసల శ్రీ వేంకటేశ అట్టె నన్నుఁ గూడితివి
మోసలేదు నీకునాకు మొక్కమెచ్చే నిన్నును॥వద్దు॥
  
  

కీర్తన విభాగము ఆంగ్లము తెలుగు తెలుగులిపిలేదు

Valid XHTML 1.0 Transitional

Valid CSS!