Bhimalapuram.co.in
అన్నమాచార్య కీర్తనలు -13489

వద్దువద్దు నీకేల వట్టివాసులు

రాగము: గౌళ

వద్దువద్దు నీకేల వట్టివాసులు
తిద్దే నేను నీయందు తీరని కడమలు॥పల్లవి॥
  
  
అంగన నీతోనాడిన అప్పటిమాటలకా
చుంగులువారఁగఁ దలఁచుక నవ్వేవు
యెంగిలి సేసిన మోవి యింపుల చేఁతలకా
సింగారపుఁగళలతో శిరసువంచేవు॥వద్దు॥
  
  
చెలి నీపై వినోదాన చేయి వేసినందుకా
వెలలేని వుబ్బుల నివ్వెర గందేవు
చలముతో బొమ్మలను జమకించి నందుకా
చిలుకుఁ గాఁకలు దేర చెమరించేవు॥వద్దు॥
  
  
కాంత నిన్నందరిలో కాఁగిలించినందుకా
పంతపుమాట లాడుచు బయలీఁదేవు
యింతలో శ్రీ వేంకటేశ యే నిన్నుఁ గూడినందుకా
మంతనానఁ బవ్వళించి మనసు చూచేవు॥వద్దు॥
  
  

కీర్తన విభాగము ఆంగ్లము తెలుగు తెలుగులిపిలేదు

Valid XHTML 1.0 Transitional

Valid CSS!