Bhimalapuram.co.in
అన్నమాచార్య కీర్తనలు -13576

వలపు కొలఁది గాదు వద్దు వద్దయ్యా

రాగము: శుద్ధవసంతం

వలపు కొలఁది గాదు వద్దు వద్దయ్యా
చెలి కోపగించుకొంటే సేసేదేమయ్యా॥పల్లవి॥
  
వూడిగపుదాన నన్ను నొడివట్టి తీసేవు
యీడ నీపట్టిపుదేవి యేమి సేసునో
వేడుక యీవేళనైతే వెనక నాపె చిక్కించుఁ
కేడనైనాఁ బరచఁగ నేమిసేసేవయ్యా॥వలప॥
  
దూతికె నింతే నేను తొడికేవు నాచన్నులు
కాతరించి నన్నెంత నీకాంత దూరునో
యేతులిప్పుడు సేసితే నింటికాడ వచ్చి యాపె
చేతులు చాఁచవచ్చితే చేరి యేమందునయ్యా॥వలప॥
  
పరిచారకపుదానఁ బైకొని నన్నేలితివి
యిరవైనమగువ నన్నెట్టు నవ్వునో
సరుస శ్రీవేంకటేశ చలివాసి యిఁక నాపె
గరిసించితే మరి గతి నీవే అయ్యా॥వలప॥
  

కీర్తన విభాగము ఆంగ్లము తెలుగు తెలుగులిపిలేదు

Valid XHTML 1.0 Transitional

Valid CSS!