Bhimalapuram.co.in
అన్నమాచార్య కీర్తనలు -13600

వలపు లిద్దరివిని వన్నె కెక్కెను

రాగము: సింధురామక్రియ

వలపు లిద్దరివిని వన్నె కెక్కెను
సళుపుల తమకము సరివచ్చెను॥పల్లవి॥
  
మొలక ముత్యాలవంటి మొనవాఁడి దంతముల
కలికి నీకెమ్మోవి గంటిసేసెను
బలిమి నీవు జంకించి పగడాలవంటిచూపు
చిలికించఁగానట్టే చెలిమేనఁ గప్పెను॥వలప॥
  
మొనమాణికాలవంటి ములువాఁడిగోళ్ళ
వనిత నీ సందుల వంకలొత్తెను
చెనకఁగానీకొప్పు చెదరి యాపె పై నిండి
జినుగునీలచీరయై సిగ్గులెల్లాఁ గప్పెను॥వలప॥
  
పసిఁడికుండలవంటి పంతపు చన్నులు నిన్ను
కొసరి యంగన కులుకుచుఁ గూడెను
యెసఁగి శ్రీ వేంకటేశ యిట్టె నీలాలనీమేను
మిసిమితోఁ బెనఁగఁగా మించులెల్లాఁ గప్పెను॥వలప॥
  

కీర్తన విభాగము ఆంగ్లము తెలుగు తెలుగులిపిలేదు

Valid XHTML 1.0 Transitional

Valid CSS!