Bhimalapuram.co.in
అన్నమాచార్య కీర్తనలు -13635

వలెననువారిదె వైష్ణవము యిది

రాగము: మలహరి

వలెననువారిదె వైష్ణవము యిది
వలపుఁ దేనెవో వైష్ణవము॥పల్లవి॥
  
  
కోరిక లుడుగుచు గుఱి నిన్నిటిపై
వైరాగ్యమెపో వైష్ణవము
సారెకుఁ గోపముఁ జలమునుఁ దనలో
వారించుటవో వైష్ణవము॥వలె॥
  
  
నుడిగొను దేహపు సుఖదుఃఖములో
వడిఁ జొరనిదెపో వైష్ణవము
ముడివడి యింద్రియముల కింకరుఁడై
వడఁబడనిదెపో వైష్ణవము॥వలె॥
  
  
వుదుటునఁ దన సకలొపాయంబులు
వదలుటపో నిజవైష్ణవము
యెదుటను శ్రీవేంకటేశ్వరు నామము
వదనము చేర్చుట వైష్ణవము॥వలె॥
  
  

కీర్తన విభాగము ఆంగ్లము తెలుగు తెలుగులిపిలేదు

Valid XHTML 1.0 Transitional

Valid CSS!