Bhimalapuram.co.in
అన్నమాచార్య కీర్తనలు -13657

వాకిటఁ గాచుకున్నది వచ్చినదాఁకా నీవు

రాగము: రీతిగౌళ

వాకిటఁ గాచుకున్నది వచ్చినదాఁకా నీవు
జోకతోడుత నెదురు చూచీ రావయ్యా॥పల్లవి॥
  
  
విందుగాఁ దనయింటికి విచ్చేయు మనె నిన్ను
అందుకోవయ్యా కానికె అంపె నీకాపె
చెంది నిన్నుఁ దోడుకొని చేరి కొల్చి రమ్మనె
అందలము వుత్తెంచె నదిగో రావయ్యా॥వాకి॥
  
  
దండిగా నొసల నక్షంతలు నీకుఁ బెట్టుమనె
దండము వెట్టుమనెను తనమారుగా
యెండ గాకుండా గొడుగు యిదే పట్టుక రమ్మనె
అండనే ముద్దుటుంగర మంపెను రావయ్యా॥వాకి॥
  
  
కోరి పైడి పీఁటమీఁదఁ గూచుండఁ బెట్టుమనె
చేరె నీసంగడికిఁ దాఁ జేకొను మిఁక
యీరీతి శ్రీవేంకటేశ యీకె యలమేల్మంగ
కూరిమితోఁ గూడితివి గుట్టున రావయ్యా॥వాకి॥
  
  

కీర్తన విభాగము ఆంగ్లము తెలుగు తెలుగులిపిలేదు

Valid XHTML 1.0 Transitional

Valid CSS!