Bhimalapuram.co.in
అన్నమాచార్య కీర్తనలు -13664

వాడవారి మెప్పించవలెఁగా నీకు

రాగము: శ్రీరాగం

వాడవారి మెప్పించవలెఁగా నీకు
వాడుదేరి మాటలాడవలెఁగా నీకు॥పల్లవి॥
  
  
చెలియవలపు నీ చిత్తానఁ బట్టకుండినా
వలరాచపాది చూడవలెఁగా నీకు
సెలవులనగవులు జిగి మించకుండినాను
బలిమిఁ దెచ్చుకొనైనా వలెఁగా నీకు॥వాడ॥
  
  
యీ వనితవూడిగాలు యింపులు గాకుండినాను
వావికి సరస మాడవలెఁగా నీకు
చేవదేరియాసలు చిమ్మి రేఁగ కుండినాను
వావాత మొగమోట వలెఁగా నీకు॥వాడ॥
  
  
తరుణిపై తలఁపు లాతల నీకు నుండినాను
వరునకుఁ గౌఁగిలించవలెఁగా నీకు
యిరవై శ్రీవేంకటేశ యింత సేసి కూడితివి
వరుఁడవైన కీర్తి వలెఁగా నీకు॥వాడ॥
  
  

కీర్తన విభాగము ఆంగ్లము తెలుగు తెలుగులిపిలేదు

Valid XHTML 1.0 Transitional

Valid CSS!