Bhimalapuram.co.in
అన్నమాచార్య కీర్తనలు -13682

వారిధిశయన వో వటపత్రపరియంక

రాగము: దేవగాంధారి

వారిధిశయన వో వటపత్రపరియంక
గారవాన మేలుకొని కన్నులు దెరవవే॥పల్లవి॥
  
  
ఘన యోగి హృదయపు కమలాలు వికసించె
వొనర విజ్ఞాన సూర్యోదయమాయ
మును జీవ పరమాత్మముల జక్కవలు గూసె
వనజాక్ష మేలుకొని వాకిలి దెరవవే॥వారిధి॥
  
  
కలుషముల నేటి చీఁకట్లెల్లఁ బెడఁబాసె
నలువంక వేద కీరనాదము మ్రోసె
అలరి యితర ధర్మాల నేటి చుక్కలు మాసె
జలజాక్ష మేలుకొని సతి మోము చూడవే॥వారిధి॥
  
  
కపట రాక్షస నేత్ర కలు హారములు మోడ్చె
యిపుడే సుకర్మముల యెండలు గాసె
అపురూప శ్రీ వేంకటాద్రీశ మేలుకొని
నిపుణుఁడ యిందిరయు నీవు మమ్ముఁ గావనవే॥వారధి॥
  
  

కీర్తన విభాగము ఆంగ్లము తెలుగు తెలుగులిపిలేదు

Valid XHTML 1.0 Transitional

Valid CSS!