Bhimalapuram.co.in
అన్నమాచార్య కీర్తనలు -13695

వాసికి బతుకుటింతే వనితలయినవారు

రాగము: శ్రీరాగం

వాసికి బతుకుటింతే వనితలయినవారు
పాసిన కూటికంటే పస్తైనా మేలురా॥పల్లవి॥
  
  
రాకుండేవాఁడవా రాతిరెల్ల మాయింటికి
ఆకడ నీ కెవ్వతో పై యాడెఁగాక
నీకు నీగుణము లేదు నేఁడిన్నాళ్లదాఁకా
కాకునఁ బడుటకంటే కడనుంటే మేలురా॥వాసి॥
  
  
కోపగించేవాఁడవా కొసరి నే నేమన్నా
నీపావ మెవ్వతొ! నీకు నేరిపెఁగాక
యేపున మారుమాటాడ వెన్నఁడు నేఁడలిగేవు
తీపులలోఁన జేఁదైతే తెగువలే మేలురా॥వాసి॥
  
  
తలవంచేవాడవా దగ్గరి కాఁగిలించితే
కులుకి యెవ్వతో బాసగొన్నదిగాక
బలిమి శ్రీవేంకటేశ పై కొని నిన్నుఁ గూడితి
కలకాలమును నిన్నుఁ గాచుకున్న మేలురా॥వాసి॥
  
  

కీర్తన విభాగము ఆంగ్లము తెలుగు తెలుగులిపిలేదు

Valid XHTML 1.0 Transitional

Valid CSS!