Bhimalapuram.co.in
అన్నమాచార్య కీర్తనలు -13706

వాఁడి గలవాఁడ వౌత వడి నే మెఱుఁగుదుము

రాగము: సామంతం

వాఁడి గలవాఁడ వౌత వడి నే మెఱుఁగుదుము
వేఁడిమి దుష్టులమీఁద విసరంగ రాదా॥పల్లవి॥
  
  
వోప నంటాఁ బెనఁగితే నుడికి తిట్ట వచ్చేవు
ఆపనికే యెంత కెంత ఔరా నీవు
కోపము గలిగితేను గురిఁ బగవారిమీఁదఁ
జూప రాదా యీడ నేల చూపేవు నీవు॥వాడి॥
  
  
తనిసినవారిమీఁదఁ దగఁ జేతులు చాఁచేవు
యెన లేనికాఁకతోడ నేరానీవు
మొన చూప వలసితే ముంచి నీకు నెదిరించి
చెనకెటివారపైనే చేఁత సేయ రాదా॥వాడి॥
  
  
పొలసి నంతటిలోనె పొదిగి నన్నుఁ గూడితి
మెలుపు శ్రీవెంకటేశ మేలురా నీవు
బలిమి నీకుఁ గలితే పౌఁజులమీఁద నురికి
వలసినట్టు మెరయ వద్దనేనా నేను॥వాడి॥
  
  

కీర్తన విభాగము ఆంగ్లము తెలుగు తెలుగులిపిలేదు

Valid XHTML 1.0 Transitional

Valid CSS!