Bhimalapuram.co.in
అన్నమాచార్య కీర్తనలు -13724

విచారపరులాల వివేకులాల

రాగము: లలిత

విచారపరులాల వివేకులాల
పచరించి తెలిసి యా పగిది నడువుఁడీ॥పల్లవి॥
  
  
చేసినపుణ్యమువల్ల చెలఁగి దేవత లైరి
ఆసరిఁ బాపమువల్ల నసుర లైరి
దాసరితనమువల్లఁ దగ నారదాదులైరి
వాసి నిందెవ్వ రెక్కుడొ వడి నెంచు కొనుఁడీ॥విచార॥
  
  
ఘనరాజసగుణాన కలుగు నిహలోకము
అనిశముఁ దామసాన నధోగతి
మొనసి సాత్త్వికమున మోక్షము సిద్ధించు
ననుపమ పదమేదొ అది యెంచుకొనుఁడీ॥విచార॥
  
  
పరగ దేహమూలము ప్రాకృతమయిన మాయ
అరాసి యాత్మ నీడేర్చు నలమేల్మంగ
సిరుల నంతర్యామి శ్రీవేంకటేశ్వరుఁడు
సరి నిందు మీ బ్రదుకుజాడ యెంచుకొనుఁడీ॥విచార॥
  
  

కీర్తన విభాగము ఆంగ్లము తెలుగు తెలుగులిపిలేదు

Valid XHTML 1.0 Transitional

Valid CSS!