Bhimalapuram.co.in
అన్నమాచార్య కీర్తనలు -13779

వినయాలు సేసేవు వేంకటేశుఁడ

రాగము: సాళంగనాట

వినయాలు సేసేవు వేంకటేశుఁడ
వెనువెంటఁ బాయక వేంకటేశుఁడ॥పల్లవి॥
  
  
విరుల వేసే వదేమో వేంకటేశుఁడ
వెరగయ్యీ నీ చేతఁకు వేంకటేశుఁడ
విరివాయ నీసుద్దులు వేంకటేశుఁడ
అరుదుగ వింటిమోయి అన్నీ వేంకటేశుఁడ॥విన్న॥
  
  
వేడుకకాఁడ వౌదువు వేంకటేశుఁడ
వీడుదోడాడేవు మాతో వేంకటేశుఁడ
వీడెపు మోవి నవ్వేవు వేంకటేశుఁడ
జాడలెల్లా గంటిమోయి సారె వేంకటేశుఁడ॥విన్న॥
  
  
వేసాల బాఁడవుగదో వేంకటేశుఁడ
వేసారవు రతులను వేంకటేశుఁడ
వేసేవు నాపైఁ జేయి వేంకటేశుఁడా నన్ను
సేసవెట్టి పెండ్లాడేవు శ్రీవేంకటేశుఁడా॥విన్న॥
  
  

కీర్తన విభాగము ఆంగ్లము తెలుగు తెలుగులిపిలేదు

Valid XHTML 1.0 Transitional

Valid CSS!