Bhimalapuram.co.in
అన్నమాచార్య కీర్తనలు -13853

విన్నవించరే యీమాట విభునికిఁ జెలులాల

రాగము: ఆహిరి

విన్నవించరే యీమాట విభునికిఁ జెలులాల
కన్నుల సన్నలనే కానవచ్చీ వలపు॥పల్లవి॥
  
  
చెక్కులఁబెట్టినచేయి సిగ్గులకు మూలము
మొక్కినమొక్కులు ప్రియములకు దాపు
నిక్కినిక్కి చూపులు నిండుమోహములచోప్పు
ఇక్కువలు చూచికోరే ఇంతిభావములను॥విన్న॥
  
  
మోనముననుండినదె మోహమునకు మూలము
వానలచెమటలే జవ్వనము చిహ్న
తానకపునిట్టూర్పులు తలపోఁతలకు వింత
పూని కనుఁగోనరే ఇపుడు తారుకాణలు॥విన్న॥
  
  
సెలవినవ్వులు రతి సేఁతలకు సన్నలు
కలఇకలకుమోముకళ లెరుక
అలమె శ్రీవేంకటేశు డలమేల్‌మంగ నీకెను
యెలమితోఁ బొగడరే యీకె మేచ్చీ నితని॥విన్న॥
  
  

కీర్తన విభాగము ఆంగ్లము తెలుగు తెలుగులిపిలేదు

Valid XHTML 1.0 Transitional

Valid CSS!