Bhimalapuram.co.in
అన్నమాచార్య కీర్తనలు -13861

విన్నవించవలెనా వీరూ వారు నిందులకు

రాగము: సామంతం

విన్నవించవలెనా వీరూ వారు నిందులకు
పన్నిన మీ కంకణాలే పదిలాలు గాక॥పల్లవి॥
  
  
వాసులెంచనేఁటికి వలసినచోటికి
యిసునఁగోపించినాను ఇంపులేకాక
వేసరఁగఁ బనిలేదు వేయైనా మీకె పోదు
సేసతోఁ బెండ్లాడినట్టిచెలియకుఁ బతికి॥విన్న॥
  
  
కోపగించనొద్దు నొద్దు కొనకెక్కె నదె పొద్దు
చేపట్టినప్పుడే మీకుఁ జెల్లెఁగాక
మోపులాయఁ బులకలు ముంచినసిగ్గులు వోయ
యేపున నేర్పరులు మీ కింతగద్దా చలము॥విన్న॥
  
  
కూడితిరి చాలను గుణములు మేలును
యీడుజోడు లెంచనేల ఇంతటిమీఁద
వేడుకలు తదకెక్కె వింతకళలెల్లా నిక్కె
యీడనే శ్రీవేంకటేశ ఇందిరకు నీకును॥విన్న॥
  
  

కీర్తన విభాగము ఆంగ్లము తెలుగు తెలుగులిపిలేదు

Valid XHTML 1.0 Transitional

Valid CSS!