Bhimalapuram.co.in
అన్నమాచార్య కీర్తనలు -13910

విరులదండలతోడి విట్ఠలేశా । నీవు

రాగము: దేసాళం

విరులదండలతోడి విట్ఠలేశా । నీవు
యెరవులేనివాఁడవు యెపుడు విట్ఠలేశా॥పల్లవి॥
  
  
విచ్చేయు మా ఇంటికి విట్ఠలేశా । నీకు
విచ్చనవిడాయ నిది విట్ఠలేశా
విచ్చి చెప్పే నిటు నీకు విట్ఠలేశా । నాకు
నిచ్చినబాస దప్పకు మిఁక విట్ఠలేశా॥విరు॥
  
  
వీడె మియ్యఁగదవోయి విట్ఠలేశా । కడు-
వేడుకకాఁడవు నీవు విట్ఠలేశా
వీడుజోడాయ వలు విట్ఠలేశా
పాడిఁ బంతాలెల్లఁ జెల్లె బాపు విట్ఠలేశా॥విరు॥
  
  
విడిచేవు పోఁకముడి విట్ఠలేశా । యెంత
వెడమాయకాఁడవయ్య విట్ఠలేశా
కడఁగి శ్రీవేంకటాద్రిఁ గలసితివి
అడియాలముగ నన్ను నౌఁర విట్ఠలేశా॥విరు॥
  
  

కీర్తన విభాగము ఆంగ్లము తెలుగు తెలుగులిపిలేదు

Valid XHTML 1.0 Transitional

Valid CSS!