Bhimalapuram.co.in
అన్నమాచార్య కీర్తనలు -13918
వివరించి చెప్పవయ్యా వినవేడుకయ్యీ వకు
రాగము: సౌరాష్ట్రం
వివరించి చెప్పవయ్యా వినవేడుకయ్యీ వకు | |
సవరఁగా నేము తెరచాటుననే వుంటిమి | ॥పల్లవి॥ |
యింతవడి నాపె నీవూ నేకతము లాడితివి | |
పంతమున నది యెంతపనికో కాని | |
చెంతఎ దెరలో కొలువసేయించుకొంటా నుంటివి | |
వింతలుగా నెటువంటివేడుకోకాని | ॥వివ॥ |
చప్పుడుగా విడే లాపెజంట నుండి సేసితివి | |
దప్పిదేర నెటువంటితమియోకాని | |
తప్పక జాగరాలు తఱచుగాఁ బెంచితివి | |
గొప్పగా నేమిగడించుకొంటివోకాని | ॥వివ॥ |
ననుపున నాపెతోను నవ్వుతానే వుండితివి | |
సొనిపి యేమిమర్మాలు సోఁకెనోకాని | |
యెనసితివి శ్రీవేంకటేశ యలమేల్మంగను | |
ననుఁ గూడితివి యెంత నాపైబత్తోకాని | ॥వివ॥ |
కీర్తన విభాగము ఆంగ్లము తెలుగు తెలుగులిపిలేదు