Bhimalapuram.co.in
అన్నమాచార్య కీర్తనలు -13937

కర్త :: తాళ్లపాక అన్నమాచార్య

రాగము: శంకరాభరణం

వింటిమయ్యా నేఁడు నీ వేడికెలు
కంటిమయ్యా తోడుతనే కందువ వాడికెలు॥పల్లవి॥
  
  
వలపుల తమ్మివిరివాటులు
సొలపులఁ బెనఁగినచోటులు
నెలకొని వున్న నీనీటులు
కొలువులో సుద్దులివి కొండలుఁ గోటులు॥॥
  
  
వెల్లవిరిచూపుల నీవీడేలు
మెల్లనె తమకముల మేడేలు
కొల్లలు నీతమకపుగూడేలు
పెల్లురేఁగెఁ బుక్కిళ్ళ పెండ్లివీడేలు॥॥
  
  
పాలకూళ్ళలోననె పంతాలు
చాలా నమరె నీసంతాలు
యేలితివి శ్రీవేంకటేశ యలమేల్మంగను
యీలీల నాతో నాడేవు యేకాంతాలు॥॥
  
  

కీర్తన విభాగము ఆంగ్లము తెలుగు తెలుగులిపిలేదు

Valid XHTML 1.0 Transitional

Valid CSS!