Bhimalapuram.co.in
అన్నమాచార్య కీర్తనలు -13964

వింతలేల సేసేవే విభుఁడు నీకు నితఁడు

రాగము: బలహంస

వింతలేల సేసేవే విభుఁడు నీకు నితఁడు
చెంత నీ మతి యాతనిచిత్తము గాదా॥పల్లవి॥
  
చిప్పిలమోవి ఇమ్మంటే సిగ్గువడ నేఁటికే
చొప్పున నిది యాతనిసొమ్ము గాదా
కొప్పు నీకుఁబెట్టేనంటే గొణఁగఁగ నేఁటికే
యెప్పుడూ నితనిసేస కిరవు గాదా॥వింత॥
  
చన్నులు చూపుమంటేను జంకించనేఁటికే
పన్ని యీతనికి చేపట్లు గావా
పన్నీట నోలార్చేనంటే పలునవ్వులేఁటికే
అన్నిటా నీమేనితని కరడుతీగె గాదా॥వింత॥
  
మొలనూలు వెట్టిరాఁగా మొక్కేవిదేఁటికే
పొలుపు శ్రీవేంకటేశు పొలముగాదా
అలరి నిన్నురమెక్కు మనఁగాఁ గొంకనేఁటికే
నెలఁత నీవే యతని నిండుసొమ్ముగాదా॥వింత॥
  

కీర్తన విభాగము ఆంగ్లము తెలుగు తెలుగులిపిలేదు

Valid XHTML 1.0 Transitional

Valid CSS!