Bhimalapuram.co.in
అన్నమాచార్య కీర్తనలు -13970

వింతవాఁడా తానేమి వేగిరించ నేమిటికి

రాగము: సామంతం

వింతవాఁడా తానేమి వేగిరించ నేమిటికి
చెంతనుండి యెప్పుడైనా సేవసేసే తనకు॥పల్లవి॥
  
  
సమ్మతించితేనే మాట చవులై యుండునే
ఇమ్ముల నేమనఁగాను యెట్టుండునో
కమ్మరఁ దానే వచ్చి కరుణించిణప్పుడయ్యీ
ముమ్మాఁటికి నీవేళ మొక్కేనే తనకు॥వింత॥
  
  
తగులైన పొందులే తమకము రేఁచునే
మొగమిచ్చలెల్లా ప్రియములు రేఁచీనా
తగిలి నాయింటికి తానే వచ్చిన దాఁకా
పగటు మోహము జన్నెవట్టుకుండేఁ దనకు॥వింత॥
  
  
పానుపుపై నుండితేనే పంతము లీడేరునే
నానినఁగాని కొంత నయమెక్కదు
తానే శ్రీవేంకటేశుఁడు తగఁ బేలకుర్తిలోన
పూని చెన్నుఁడై నన్నేలె పొంచుకుండేఁ దనకు॥వింత॥
  
  

కీర్తన విభాగము ఆంగ్లము తెలుగు తెలుగులిపిలేదు

Valid XHTML 1.0 Transitional

Valid CSS!