Bhimalapuram.co.in
అన్నమాచార్య కీర్తనలు -13978

విందము దన సుద్దులు వేగిర మేలే

రాగము: నట్టనారాయణి

విందము దన సుద్దులు వేగిర మేలే
అందికలుఁ బొందికలు అణఁగీనా యిఁకను॥పల్లవి॥
  
  
నాననీవే వలపులు నవ్వితేనెందు వొయ్యీని
తానే వచ్చీఁ గాక తరవేఁటికి
కానీలేవే అందుకేమి కడురతులఁ దనిసి
మానుపడి వున్నాఁడేమో మరచీనా నన్నును॥వింద॥
  
  
పెంచనీవే గర్వములు బిగిసితేనేమాయ
వంచుకొనేఁ గాక మీరు వద్దననేలే
కొంచక సతులలోనఁ గొలువై వుండినవేళ
మించినపరాకేమో మీమాట వినఁడా॥వింద॥
  
  
సేయనీవే తరితీపు చెనకితేనేమాయ
యీయెడ నేనుండేఁ గాక యీరసాలేలే
వేయిటికి శ్రీవేంకటేశుఁడిదె కూడె
పాయపు వినోదమేమో బాఁతయ్యీననేను॥వింద॥
  
  

కీర్తన విభాగము ఆంగ్లము తెలుగు తెలుగులిపిలేదు

Valid XHTML 1.0 Transitional

Valid CSS!