Bhimalapuram.co.in
అన్నమాచార్య కీర్తనలు -14012

వీఁడె వీఁడె కూచున్నాఁడు వేడుకతో గద్దెమీఁద

రాగము: ధన్నాసి

వీఁడె వీఁడె కూచున్నాఁడు వేడుకతో గద్దెమీఁద
వాఁడి ప్రతాపము తోడి వరదానసింహము॥పల్లవి॥
  
  
అరయఁ బ్రహ్లాదుని ఆపదోద్ధారసింహము
గిరివై యిందిరకును క్రీడాసింహము
నిరతి సురల భయనివారణసింహము
సరి హిరణ్యకసిపు సంహారసింహము॥వీఁడె॥
  
  
ఇట్టె విశ్వమునకు నేలికైన సింహము
గట్టిగ శరణాగతులఁ గాచే సింహము
దిట్టయై వేదాలలోని తెరవేఁటసింహము
నెట్టుకొనిన దురితనివారణసింహము॥వీఁడె॥
  
  
అంచల మూఁడుమూర్తుల కాధారమైన సింహము
పంచల మునుల భాగ్యఫలసింహము
పొంచి శ్రీవేంకటాద్రికి భూషణమైన సింహము
చెంచుల అహోబలపు శ్రీనారసింహము॥వీఁడె॥
  
  

కీర్తన విభాగము ఆంగ్లము తెలుగు తెలుగులిపిలేదు

Valid XHTML 1.0 Transitional

Valid CSS!