Bhimalapuram.co.in
అన్నమాచార్య కీర్తనలు -14055

వెనక మమ్మన వద్దు వెతలఁ బొరల వద్దు

రాగము: హిందోళం

వెనక మమ్మన వద్దు వెతలఁ బొరల వద్దు
అనుమాన మెల్లఁ దీరె నరసుకోవమ్మా॥పల్లవి॥
  
  
తలఁచఁగానె వచ్చె తరుణి నీరమణుఁడు
అలరి మీమచ్చటలు ఆడుకోరమ్మా
నిలుచున్నాఁ డదివో నీయెదుట నతఁడు
తెలియఁగల వెల్లాను తెలుసుకోవమ్మా॥వెనక॥
  
  
చేతికి లో నై యున్నాఁడు చిల్లరచేఁతలు మేన
ఘాతలుగ లేవు గదా కనుకోవమ్మా
యేతుల నీ చెప్పినట్టు యేమి సేయు మన్నాఁ జేసీ
యీతల నొరసి చూడు మింకా నోయమ్మా॥వెనక॥
  
  
గక్కనఁ బ్రేమ మెరిఁగి కాఁగిలించినాఁ డిదివో
మిక్కిలి శ్రీవెంకటేశు మెచ్చవమ్మా
నిక్కి యీతనిగుణాలు నీ వెరఁగ వలసితే
చెక్కు నొక్కి బుజ్జగించి చిత్తగించవమ్మా॥వెనక॥
  
  

కీర్తన విభాగము ఆంగ్లము తెలుగు తెలుగులిపిలేదు

Valid XHTML 1.0 Transitional

Valid CSS!