Bhimalapuram.co.in
అన్నమాచార్య కీర్తనలు -14078
వెరగుతో మరచితే వెనక లేదు
రాగము: గుండక్రియ
వెరగుతో మరచితే వెనక లేదు | |
కరివరదుఁడే తక్క గతి యొండు లేఁడు | ॥పల్లవి॥ |
ఆస విడిచినఁగాని యధిక సుఖము లేదు | |
యీసు విడిచినఁగాని యిహము లేదు | |
వాసి విడిచినఁ గాని వైపగు విరతి లేదు | |
వాసు దేవ భక్తిఁగాని వరముక్తి లేదు | ॥వెరగు॥ |
చలము మానినఁగాని సాత్వికగుణము లేదు | |
పలుశంక వోకకాని ఫలము లేదు | |
సిలుగింద్రియాల గెలిచినఁగాని త్రోవ లేదు | |
జలజాక్షుచింతఁగాని సమబుద్ధిలేదు | ॥వెరగు॥ |
దైవము కరుణనెకాని తగువిజ్ఞానము లేదు | |
భావించి చూచినఁగాని బలిమి లేదు | |
యీవల శ్రీ వేంకటేశుఁ డితడె దైవ మితని | |
సేవించినంతఁగాని సిద్ధి మరి లేదు | ॥వెరగు॥ |
కీర్తన విభాగము ఆంగ్లము తెలుగు తెలుగులిపిలేదు