Bhimalapuram.co.in
అన్నమాచార్య కీర్తనలు -14083

వెరపులు నొరపులు వృథా వృథా

రాగము: ముఖారి

వెరపులు నొరపులు వృథా వృథా
ధరపై మరి యంతయును వృథా॥పల్లవి॥
  
  
తడయక చేసినదానంబులు వృథ
యెడనెడ నెఱిఁగిన యెఱుక వృథా
వొడలిలోనిహరి నొనరఁగ మతిలోఁ
దడవనిజీవమె తనకు వృథా॥వెరపు॥
  
  
జగమునఁ బడిసినసంతానము వృథ
తగిలి గడించినధనము వృథ
జగదేకవిభుని సకలాత్ముని హరిఁ
దెగి కొలువనిబుద్దియును వృధా॥వెరపు॥
  
  
పనివడికూడిన పరిణామము వృథ
వొనరఁగనుందినవునికి వృథా
ఘనుఁడుగు తిరువేంకటగిరి హరిఁగని
మననేరని జన్మములు వృథా॥వెరపు॥
  
  

కీర్తన విభాగము ఆంగ్లము తెలుగు తెలుగులిపిలేదు

Valid XHTML 1.0 Transitional

Valid CSS!