Bhimalapuram.co.in
అన్నమాచార్య కీర్తనలు -14085

వెరవుతోనింకాఁ జూచే విశేషాలు

రాగము: రామక్రియ

వెరవుతోనింకాఁ జూచే విశేషాలు
తెరమరఁ గెటువలెఁ దీసేవయ్యా॥పల్లవి॥
  
  
పలుసన్న లేమిటికి పనులేమి గలిగిన
తెలియనానతీరాదా తెలిసేను
నిలువు నూరు వండీ నీమేనిపచ్చిచేఁతలు
నలువంక నికనెట్టు నమ్మించేవయ్యా॥వెర॥
  
  
వట్టిగుట్టులేమిటికి వలపింతగలిగిన
గట్టిగాఁ జూపవయ్యా కానిమ్మనేను
పుట్టెడు పోఁకకమ్మీ బొంకుల నీబాసలు
బట్టబయలెట్టు వొడఁబరచేవయ్యా॥వెర॥
  
  
శిరసు వంచనేఁటికి సిగ్గులెంత కలిగినా
వొరసి కూడితివయ్య వొడఁబడేను
కురిసేఁ దేనెలు మోవికోరి శ్రీవేంకటేశుఁడ
తరవాతి రతినెట్టుఁ దనిపేవయ్యా॥వెర॥
  
  

కీర్తన విభాగము ఆంగ్లము తెలుగు తెలుగులిపిలేదు

Valid XHTML 1.0 Transitional

Valid CSS!