Bhimalapuram.co.in
అన్నమాచార్య కీర్తనలు -14087

వెరవు విచారించుకొంటే వేగిరించేవు

రాగము: ముఖారి

వెరవు విచారించుకొంటే వేగిరించేవు
యెరవేది యిందు నాపె యేమి సేసునయ్యా॥పల్లవి॥
  
  
జగడములెల్లాఁ దీరె సరసములాడితేను
నగితే కోపములేదు ననుపాయను
వెగటుఁగాఁతాళాలు వీడెను విడెమిచ్చితే
యెగసక్యమేది యింతి యేమిసేసునయ్యా॥వెరవు॥
  
  
మఱఁగులెల్లాఁబాసె మాట్టపలుకాడితేను
మఱచితేఁబగలేదు మనసిచ్చెను
కొఱకొఱలెల్లఁ దీరె కొచ్చికొచ్చిచూచితేను
యెఱఁగనిదేది యింతి యేమిసేసునయ్యా॥వెరవు॥
  
  
మచ్చరమింతా మానె మరి వద్దఁ గూచుండితే
లచ్చనంటితేఁ గొంకదు లాగాయను
పచ్చిదేరే శ్రీవెంకటపతినాపె గలసితే
యెచ్చుకుందులేవి యింతి యేమిసేసునయ్యా॥వెరవు॥
  
  

కీర్తన విభాగము ఆంగ్లము తెలుగు తెలుగులిపిలేదు

Valid XHTML 1.0 Transitional

Valid CSS!