Bhimalapuram.co.in
అన్నమాచార్య కీర్తనలు -14107

వెఱ్ఱి దెలిసి మరియు వేఁదురు దవ్వేము నేము

రాగము: దేసాక్షి

వెఱ్ఱి దెలిసి మరియు వేఁదురు దవ్వేము నేము
ముఱ్ఱుఁబాల మంకువాఁడ మూలమా శరణు॥పల్లవి॥
  
  
తోలు నెముకలు ముట్టి దోసమంటాఁ దీర్థమాడి
తోలు నెముకల మేనితోడ నున్నాఁడ
వాలిన జీవహింస వద్దని చైతన్యముతో
తేలించి శాకపాకాల దిగమింగేము॥వెఱ్ఱి॥
  
  
బూతునఁ బుట్టినందుకు పుణ్యములెల్లాఁ జేసి
బూతుల సంసారమే భోగించేము
పాతకములెల్లాఁ బోను బహుదానము లొసఁగి
ఆతల నొరులఁ బోయి అడిగేము నేము॥వెఱ్ఱి॥
  
  
కర్మము లన్నియుఁ దోసి ఘనము క్తిఁ బొందేనంటా
కర్మాచరణములే కడుఁ జేసేము
నిర్మించి శ్రీవేంకటేశ నేరాలు నన్ను నెంచక
ధర్మము దలఁచి నీవే దయఁ జూడవే॥వెఱ్ఱి॥
  
  

కీర్తన విభాగము ఆంగ్లము తెలుగు తెలుగులిపిలేదు

Valid XHTML 1.0 Transitional

Valid CSS!