Bhimalapuram.co.in
అన్నమాచార్య కీర్తనలు -14155

వెల్లవిరి సేతురటే వెక్కసపు మగవాని

రాగము: శ్రీరాగం

వెల్లవిరి సేతురటే వెక్కసపు మగవాని
తెల్లమిగాఁ గోపించితే తెగువలు మీరవా॥పల్లవి॥
  
  
మదనాతురుఁ డొకరిమాటలు వినేనా
పొదలి చింతలనే పొరలుఁగాక
పదరి ననుబోంట్లు బలిమి సేసి పట్టితే
విదిలించి సిగ్గులెల్లా విడువక మానునా॥వెల్ల॥
  
  
ననుపువేడుకకాఁడు నవ్వేవారి నెరుఁగునా
మునుకొన్నవలపుల మునుగుఁగాక
కొనఁ బెట్టి మన మెంతకద్ది నిలుపఁ బోయినా
తను యించుకంత మొకదాకిరియు మానఁడా॥వెల్ల॥
  
  
ఆసలఁ జిక్కినవాఁడు అవుఁగాము లెరుఁగు
వేసరక అదేపనై వెదకుఁ గాక
వేసాల శ్రీవేంకటేశు వెలయ నేఁ గూడితి
యీసు దీరె నన్నే కాక యితరులఁ బొందునా॥వెల్ల॥
  
  

కీర్తన విభాగము ఆంగ్లము తెలుగు తెలుగులిపిలేదు

Valid XHTML 1.0 Transitional

Valid CSS!