Bhimalapuram.co.in
అన్నమాచార్య కీర్తనలు -14203

వేగిరింతునా యెంత వేసట గలిగినాను

రాగము: గౌళ

వేగిరింతునా యెంత వేసట గలిగినాను
చేగదేరితే వలపు చిమ్మి రేఁగీఁగాక॥పల్లవి॥
  
  
యెక్కడనైనాఁ బతి యేమి సేసి వచ్చినాను
వెక్కసాలాడవచ్చునా వెలఁదికిని
పెక్కులాఁగులఁ బెనఁగి ప్రియములు చెప్పఁగాను
మక్కువ నాతఁడే మరి మన్నించీఁగాక॥వేగి॥
  
  
నెట్టన నాతని మేన నిండా గురుతు లుండినా
పట్టి చూపవచ్చునా పడఁతికిని
గుట్టుతోడనే వుండి కొలువులు సేయఁగాను
జట్టిగొని యాతఁడే చనవిచ్చీఁగాక॥వేగి॥
  
  
యెలమి శ్రీ వేంకటేశుఁ డెంత రతిఁ గదిమినా
అలఇంచవచ్చునా అంగనకును
మెలఁగి నావలెఁ గూడి మేర మీరకుండఁగాను
చలువఁగాఁ దానే మోవి చవిచూపీఁగాక॥వేగి॥
  
  

కీర్తన విభాగము ఆంగ్లము తెలుగు తెలుగులిపిలేదు

Valid XHTML 1.0 Transitional

Valid CSS!