Bhimalapuram.co.in
అన్నమాచార్య కీర్తనలు -14274

వేళావేళలు లేవా వినోదములకైనాను

రాగము: పాడి

వేళావేళలు లేవా వినోదములకైనాను
యేలా తమకించి వస్తే యిది నీ వెఱఁగవా॥పల్లవి॥
  
  
అయ్యో సారె నన్ను నలయించే వేరా
వొయ్యారపువాఁడ యింత కోపుదునా
చయ్యాటాన జాజిమొగసానఁ బట్టే వేరా
నెయ్యపు నాతలఁ పిది నీ వెఱఁగవా॥వేళా॥
  
  
యిటె మాఁటిమాఁటికి యేఁచే విదేమిరా
పట్టిన నీ చలాన నేఁ బడఁగలనా
వుట్టిపడి చిగురాకు వుక్కఁ బెట్టే వేరా
నెట్టెన నా వల పిది నీ వెఱఁగవా॥వేళా॥
  
  
చాలాఁ దరితీపుల సటలు సేసే వేరా
బాలకి నింతే నిన్నుఁ బాయ గలనా
మేలిమి దామెరలోఁ దుమ్మిద గూడినటునన్ను
యేలి శ్రీవెంకటనాథ యిది నీ వెఱఁగవా.॥వేళా॥
  
  

కీర్తన విభాగము ఆంగ్లము తెలుగు తెలుగులిపిలేదు

Valid XHTML 1.0 Transitional

Valid CSS!