Bhimalapuram.co.in
అన్నమాచార్య కీర్తనలు -14281

వేవేలకు నొకటే విన్నప మిదే

రాగము: ఆహిరినాట

వేవేలకు నొకటే విన్నప మిదే
చేవదేరె వలపులు చిత్తగించవయ్యా॥పల్లవి॥
  
  
వూరనూర నూఁటలాయ నువిదకుఁ జెమటలు
కోరికలైతేఁ బెద్దకొండలాయను
కారుకొని తమకము గంపలకొలఁదులాయ
చేరవచ్చి మగువనుఁ జిత్తగించవయ్యా॥వేవే॥
  
  
చెప్పఁజెప్పఁ గొత్తలాయ చెలిచెక్కిటిచింతలు
ముప్పిరిగొన్నయాసలు మోపులాయను
కప్పి నీసుద్దులు వినఁగడుఁదరితీపులాయ
చిప్పిల మాఁటాడీ యింతిఁ జిత్తగించవయ్యా॥వేవే॥
  
  
చూడఁజూడ సొంపులెక్కె సుదతిమోముకళలు
వేడికలైతే వెల్లావిరులాయను
యీడనె శ్రీవేంకటేశ యేలితివి మన్నించి
చేడె నీకు దేవులాయఁ జిత్తిగించవయ్యా॥వేవే॥
  
  

కీర్తన విభాగము ఆంగ్లము తెలుగు తెలుగులిపిలేదు

Valid XHTML 1.0 Transitional

Valid CSS!