Bhimalapuram.co.in
అన్నమాచార్య కీర్తనలు -14294

వేవేలు సతులుగల వేడుకకాఁడవు నీవు

రాగము: భైరవి

వేవేలు సతులుగల వేడుకకాఁడవు నీవు
దేవులఁ గనక నీకుఁ దెలిపితిఁ జుమ్మీ॥పల్లవి॥
  
  
మంచిమాఁటలాడితేనే మగువలు చొక్కుదురు
పంచనలు సేతురు వలతురు
యించుకంత యెడసినా యెలయించి యెఁపినాను
కంచుఁబదనులవారు కామినులు సుమ్మీ॥వేవే॥
  
  
చెక్కు నొక్కి వేఁడుకొంటే చెలులు గరఁగుదురు
మక్కువఁ గాఁగిలిత్తురు మరుగుదురు
కక్కసించి యేలినాను కపటాలు నెరపినా
వుక్కబదనులవారు వువిదలు సుమ్మీ॥వేవే॥
  
  
తేజముతో నేలితేనే తెరవలు మొక్కుదురు
సాజాన సేవసేతురు సమ్మతింతురు
యీజాడ శ్రీవేంకటేశ యేలి తలమేల్మంగను
గాజుఁబదనులవారు కాంతులు సుమ్మీ॥వేవే॥
  
  

కీర్తన విభాగము ఆంగ్లము తెలుగు తెలుగులిపిలేదు

Valid XHTML 1.0 Transitional

Valid CSS!