Bhimalapuram.co.in
అన్నమాచార్య కీర్తనలు -14326

వైష్ణవులుగానివార లెవ్వరు లేరు

రాగము: ధన్నాసి

వైష్ణవులుగానివార లెవ్వరు లేరు
విష్ణుప్రభావ మీవిశ్వమంతయుఁ గాన॥పల్లవి॥
  
  
అంతయు విష్ణు మయం బట మరి దేవ-
తాంతరములు గలవననేలా
భ్రాంతిఁ బొంది యీ భావము భావించి-
నంతనే పుణ్యులవుట దప్పదుగాన॥వైష॥
  
  
యెవ్వరిఁ గొలిచిన నేమిగొరఁత మరి
యెవ్వరిఁ దలచిన నేమి
అవ్వలివ్వల శ్రీహరిరూపుగానివా-
రెవ్వరు లేరని యెరుకదోచినఁ జాలు॥వైష॥
  
  
అతిచంచలంబైన యాతుమ గలిగించు-
కతమున బహుచిత్తగతులై
యితరులఁ గొలిచిన యెడయక యనాథ-
పతితిరువేంకటపతి చేకొనుఁగాక॥వైష॥
  
  

కీర్తన విభాగము ఆంగ్లము తెలుగు తెలుగులిపిలేదు

Valid XHTML 1.0 Transitional

Valid CSS!