Bhimalapuram.co.in
అన్నమాచార్య కీర్తనలు -14342

వంచన ప్రియములవారే కాక

రాగము: కన్నడగౌళ

వంచన ప్రియములవారే కాక
నించిన కన్నీటి నేనేల నీకు॥పల్లవి॥
  
  
గిలుకు మట్టెలతోడ కిందిచూపులతోడ
సెలవి నవ్వులు నీ పైఁ జిందఁగాను
వలతువుగాక యెవ్వతి కైనఁ జిత్తము
నిలుపఁగనోపని నేనేల నీకు॥వంచన॥
  
  
గోడచాట్లతోడ కోనచీఁకటితోడ
వాడల నెలయించువారేకాక
వాడుచు లేమావి వడచల్ల వెడమాయ-
నీడలనెండే నేనేల నీకు॥వంచన॥
  
  
జగడంబులతోడ సణఁగు సొలపుతోడ
వగ నిన్ను భ్రమయించువారె కాక
దిగులులేక నిన్ను తిరువేంకటేశుఁడ
నెగులెఱుఁగక కూడు నేనేల నీకు॥వంచన॥
  
  

కీర్తన విభాగము ఆంగ్లము తెలుగు తెలుగులిపిలేదు

Valid XHTML 1.0 Transitional

Valid CSS!